కాకినాడ జనసేన ఎంపి అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్‌

  •  మోడీ, అమిత్‌ షా చెబితే ఎంపిగా పోటీ
  •  పిఠాపురంలో భారీ మెజారిటితో గెలుస్తా
  •  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాకినాడ పార్లమెంటు స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ప్రముఖ టీ బ్రాండ్‌ అయిన టీ టైమ్‌ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ జనసేన కాకినాడ ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. తెలుగుదేశం, బిజెపి పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంటు స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్‌కల్యాణ్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపి అభ్యర్థిని ప్రకటించారు. అధికార పార్టీ వైసిపి పిఠాపురంలో తనను ఓడించేందుకు ఓటుకు రూ.10 వేలు, కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తోందని పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. కార్యకర్తలంతా వైసిపి కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. ఉదయ్ శ్రీనివాస్‌ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజార్టీతో ఆయనను గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తనను పార్లమెంటుకు పోటీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షా చెబితే ఆలోచిస్తానన్నారు. అప్పుడు పిఠాపురం అసెంబ్లీ నుంచి ఉదయ్ శ్రీనివాస్‌, కాకినాడ ఎంపిగా తాను పోటీ చేస్తానని తెలిపారు.

➡️