బీఆర్‌ఎస్‌ నేత కోలా జనార్ధన్‌ మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం

Dec 30,2023 16:01 #ex cm kcr, #santhapam

తెలంగాణ: తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్‌ నాయకుడు కోలా జనార్దన్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కోలా జనార్దన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️