కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌

Apr 2,2024 14:56 #arest, #hydrabad, #KTR

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు భూవివాదం కేసులో అరెస్ట్‌ చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, మరికొందరు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నాడు. ఈ భూవివాదం కేసులో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు సహా 38 మందిపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఆయన అరెస్ట్‌ జరిగింది.

➡️