కిలో బంగారం పట్టివేత

Apr 11,2024 21:40 #2024 elections, #gold sized
  •  రూ.2.08 లక్షల నగదు స్వాధీనం

ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం పలు చోట్ల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని చెక్‌పోస్ట్‌ వద్ద కిలో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని రాయఘడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న సింహాద్రి సూరత్‌ అనే వ్యక్తికి చెందిన కారును తనిఖీ చేయగా బంగారం ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలూ చూపకపోవడంతో పార్వతీపురం ట్రెజరీకి తరలించారు. గుంటూరు జిల్లాలో వేర్వేరు చోట్ల తనిఖీలు చేపట్టి రూ.2,08,500ల నగదు సీజ్‌ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రూ.లక్ష, గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.1,08,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్‌ చేశారు.

➡️