పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై రేపు కేటీఆర్‌ సమావేశం

May 14,2024 15:50 #KTR, #speech

హైదరాబాద్‌ : తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో కేటీఆర్‌ బుధవారం భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వ్యూహం, కార్యాచరణపై కేటీఆర్‌ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఉప ఎన్నికకు బీఆర్‌ఎస్‌ తరపున ఏనుగుల రాకేశ్‌ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

➡️