బోటుపై పోదాం – ఓటేద్దాం..!

May 13,2024 12:09 #boat, #voters

విఆర్‌.పురం (అల్లూరు) : సార్వత్రిక ఎన్నికల వేళ … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుండే పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని క్యూలో నిలబడుతున్నారు. దూరాభారాల నుండి వచ్చేవారు పలు వాహనాల్లో పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలో … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విఆర్‌ పురం మండలంలోని కొల్లూరు గొందూరు తుమ్మలేరు గ్రామపంచాయతీలో గ్రామం నుండి ఓటర్లు బోట్లపై ప్రయాణించి పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

➡️