అప్పన్న స్వామిని దర్శించుకున్న లోకేష్ 

Feb 18,2024 11:59 #Nara Lokesh, #Visakha
Lokesh visited Appanna Swamy

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఆదివారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లాలోని వేపగుంట, తగరపువలసలో, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శనివారం జరిగిన శంఖారావం సభల్లో లోకేష్ పాల్గొన్న విషయం విదితమే.

➡️