పోలీసుల తీరుపై లోకేశ్‌ మండిపాటు

Mar 25,2024 12:34 #anger, #AP police, #behavior, #Nara Lokesh

ఉండవల్లి (గుంటూరు) : పోలీసుల తీరుపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. సోమవారం ఉండవల్లిలోని కరట్ట వద్ద లోకేష్‌ కారును పోలీసులు ఆపి సోదాలు చేశారు. ఎన్నికల కోడ్‌ పేరిట పోలీసులు తన వాహనాన్ని పదే పదే ఆపుతున్నారని లోకేశ్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోజులో నాలుగు సార్లు కారు ఆపుతున్నారని, డిజిపి ని తమాషాలు ఆడొద్దని చెప్పమంటూ స్థానిక పోలీసులను హెచ్చరించారు.

➡️