ఓటును సద్వినియోగం చేసుకోవాలి

Apr 12,2024 21:40 #mukesh kumar meena, #speech

– తిరుపతిలో ఎన్నికల సామగ్రిని పరిశీలించిన ముఖేష్‌కుమార్‌ మీనా
-ఎస్‌వి యూనివర్సిటీలో సెల్ఫీ పాయింట్‌
ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌, తిరుమల :ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఎన్నికల సామాగ్రి, ఇతర పరికరాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఓటు హక్కుపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు విలువ, ప్రాముఖ్యతను వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని, దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని అన్నారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో సెల్ఫీ పాయింట్‌ను జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ భారతి, రిజిస్ట్రార్‌ రజనీ, ఇతర అధికారులు ప్రారంభించారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అభిషేక సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజరు కరోల్‌, ఎన్నికల కమిషనర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా, రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర మంత్రి చెల్లు బోయిన వేణు గోపాలకృష్ణ, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

➡️