మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా..!

మంగళగిరి (గుంటూరు) : వైసిపి నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు, వైసిపి పార్టీకి కూడా రాజీనామా చేశారు. సోమవారం ఉదయం తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయంలో ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్‌ ఆర్కే.. ప్రత్యర్థులపై కేసులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నారా లోకేష్‌ పైన గత ఎన్నికలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే పార్టీకి గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు.. ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో.. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై కూడా ఆర్కే అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరగుతోంది. ఇదే సమయంలో.. మంగళగిరి వైసిపి ఇంచార్జ్‌గా గంజి చిరంజీవిని వైసిపి అధిష్టానం నియమించడం.. నిన్న ప్రత్యేకంగా ఆయన పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన వేళ ఆ కార్యక్రమానికి ఆర్కేకు ఆహ్వానం లేనట్టుగా తెలుస్తోంది.

➡️