Michaung Cyclone : ఎపిలో భారీ వర్షాలు…!

అమరావతి : ‘ మిచౌంగ్‌ ‘ తుఫాను దూసుకొస్తున్న వేళ …. ఎపిలో వాతావరణం మారింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా అక్కడక్కడ వానలు కురుస్తూనే ఉన్నాయి. ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఎపిలో స్కూల్స్‌కు సెలవు…

తుపాను కారణంగా … ఎపి వ్యాప్తంగా స్కూల్స్‌ కు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాలలో తుఫాను ప్రభావం అధికంగా ఉండటంతో ఆయా జిల్లాలలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాలలో తీవ్రతను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌ గా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ, రేపు కూడా స్కూల్స్‌కు సెలవులను అధికారులు ప్రకటించారు. మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో … ఎపి ప్రజలు అలర్ట్‌ గా ఉండాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తెలంగాణలో ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్స్‌…

తెలంగాణలో మిచౌంగ్‌ తుఫాను ప్రభావం ముంచుకొస్తుంది. తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి ఈదురుగాలులు వీస్తున్నాయి. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపుల, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్స్‌ ఐఎండి జారీ చేసింది. పలు జిల్లాలకు నేడు ఎల్లో అలెర్ట్‌ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

➡️

Post Views: 54