మిచాంగ్‌ ఆంధ్రా, తమిళనాడుకు పొంచి ఉన్న ముప్పు

Dec 5,2023 09:22 #Tufan
  • నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం?

విశాఖపట్ట్నం/ చెన్నై: మిచాంగ్‌ తుఫాను అంతకంతకు ఉధృతమవుతోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మిచాంగ్‌ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం వుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిచాంగ్‌ తుఫాన్‌ ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చెన్నైలో కుండపోతఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. సోమవారం తెల్లవారుజాము నుండి చెన్నైలో కుండపోతగా వర్షాలు కురియడంతో నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి వర్షపు నీరు చేరింది.. చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాంబరం ప్రాంతంలో నీటిలో చిక్కుకొన్న 15మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బందాలు రక్షించాయి. ముమ్మర వర్షాలతో బాసిన్‌ బ్రిడ్జ్‌, వ్యాసర్‌పాడి మధ్యలోని 14వ నెంబరు బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. పరిస్థితి బీభత్సంగా వుండడంతో మంగళవారం పబ్లిక్‌ హాలిడే ప్రకటించారు. తుపాను దెబ్బకు ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి. భారీ వర్షాలకు చెన్నైలోని కనతూరు ప్రాంతంలో ఓ గోడ కూలిపోయి ఇద్దరు కూలిలు మతి చెందారు.చెన్నైలో సముద్రాన్ని తలపిస్తున్న ఎయిర్‌పోర్ట్‌కొట్టుకుపోతున్న కార్లుచెన్నైలో పలుచోట్ల రోడ్లు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై విమానాశ్రయం సముద్రాన్ని తలపిస్తోంది. రన్‌వేపైకి వరదనీరు చేరింది. దీంతో ఇప్పటికే 16 విమాన సర్వీసులను నిలిపివేశారు. తుఫాను బీభత్సంతో విమానాల రాకపోకలను నిలిపివేసామని, మరికొన్ని విమానాలను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో బీభత్సం సష్టిస్తున్న వర్షాలకు సంబంధించిన దశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై, కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

 

➡️