సోనియా, రాహుల్‌ను కలిసిన మంత్రి ఉత్తమ్‌..

Dec 13,2023 16:37 #Sonia Gandhi, #uttam kumar reddy

ఢిల్లీ: తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. సోనియా గాంధీని, రాహుల్‌ను కలిశారు. అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్‌కు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేశారు. ఈ విషయాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసుకున్నారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

➡️