రైలు డీకొని తల్లీకుమారుడు దుర్మరణం

May 12,2024 22:40 #2 death, #Nellor, #Train Accident

– మృతుల్లో అంగన్‌వాడీ వర్కర్‌
– ఎన్నికల విధులకు వెళ్తుండగా ప్రమాదం
ప్రజాశక్తి-కావలి రూరల్‌ :ఎన్నికల విధులకు వెళ్తు రైలు ఢకొీని అంగన్‌వాడీ వర్కర్‌, ఆమె వెంట ఉన్న కుమారుడు దుర్మరణం చెందారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సైదాపురం మండలం, చాగణం గ్రామానికి చెందిన బట్టా సుభాషిణి (58) రాపూరు ప్రాజెక్ట్‌ చాగణం సెక్టార్‌లో అంగన్‌వాడీ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు కావలిలో ఎన్నికల విధులు కేటాయించడంతో భర్త, కుమారుడు విజరు కుమార్‌ (28)తో కలిసి చాగాణం నుంచి గూడూరు రైలులో కావలికి సుభాషిణి బయల్దేరారు. కావలిలో రైలు దిగి ట్రాక్‌ దాటుతుండగా అదే ట్రాక్‌పై వస్తున్న రైలు సుభాషిణిని, ఆమె కుమారుడిని ఢకొీట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లీ కుమారులకు రూ.50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుజాతమ్మ, షేక్‌ రెహనా బేగం డిమాండ్‌ చేశారు.

➡️