నగరపాలక, మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి

municipal workers strike 12th day protest arrest

– అధికారులను అడ్డగించిన పారిశుధ్య కార్మికులు

– పలు జిల్లాల్లో అరెస్టు – 8న కలెక్టరేట్ల ముట్టడి

ప్రజాశక్తి – యంత్రాంగం: సమస్యలు పరిష్కరించాలని 12 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో నగరపాలక, మున్సిపల్‌ కార్యాలయాలను శనివారం కార్మికులు ముట్టడించారు. అధికారులను కార్యాలయాల లోపలికి వెళ్లనీవ్వకుండా అడ్డగించారు. పోలీసులు బలవంతంగా కార్మికులను అరెస్టు చేశారు. విశాఖలో 400 మంది కార్మికులను అరెస్టు చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే సోమవారం కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని ఆఫీసు గేట్లను మూసివేశారు. దీంతో సిబ్బంది, ఉద్యోగులు బయటే నిలిచిపోయారు. మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఎనిమిదో తేదీన కలెక్టరేట్ల ముట్టడిస్తామని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించడంతో పలువురి నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. తాడేపల్లిగూడెంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించి అధికారులను, ఉద్యోగులను విధులకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. విశాఖలోని జివిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న 400 మంది మున్సిపల్‌ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కొంతమందిని ఉదయం నుంచే గృహ నిర్బంధం చేశారు. జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, నాయకులు వి.కృష్ణారావు తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. అనకాపల్లి పట్టణంలో పలుమార్లు చెత్త తొలగించేందుకు అధికారులు వాహనాలను తీసే ప్రయత్నాన్ని కార్మికులు అడ్డుకున్నారు.ఒంగోలులో కార్పొరేషన్‌ కార్యాలయం గేట్‌ ముందు బైటాయించి లోనికి ఎవ్వరిని వెళ్లనీయకుండా అడ్డుగా మున్సిపల్‌ కార్మికులు కూర్చుకున్నారు. మున్సిపల్‌ ఆఫీసు గేట్లు తెరవాలని, కార్యాలయం లోపల ఉన్న కమిషనర్‌ కారు, చెత్త వాహనాలను బయటకు పంపాలని కార్మికులకు పోలీసులు సూచించారు. అందుకు కార్మికులు నిరాకరించడంతో బలవంతంగా కార్మికులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. సిఐటియు నాయకులను బలవంతంగా అరెస్టు చేయడంతో కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని విడిచిపెట్టి వెళ్లిపోయారు.విజయనగరంలో నగర పాలక కార్యాలయం వద్ద కార్మికులంతా బైఠాయించి పోటీ కార్మికులు రాకుండా అడ్డుకున్నారు. బబ్బిలి మున్సిపల్‌ కార్యాలయ ముట్టడి నేపథ్యంలో పలువురి కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా గూడూరులో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు వంటా వార్పు చేపట్టారు. నంద్యాల,ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోటీ కార్మికులతో పని చేయించడాన్ని నిరసిస్తూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద చెత్త వేసి నిరసన తెలిపారు.శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురంలో మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించారు. నెల్లూరులో దర్గామిట్ట బారాషాహిద్‌ దర్గా నుంచి కార్పొరేషన్‌ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయ ప్రధాన గేటు ఎదుట బైటాయించి నిరసన చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు, కృష్ణాలో ఆందోళనలు కొనసాగాయి.

municipal workers strike 12th day knl

  • గూడూరులో మున్సిపల్ కార్మికుల వంట వార్పు 

కర్నూల్ జిల్లా – గూడూరు : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కొరకు చేపట్టిన సమ్మె గూడూరులో సిఐటియు ఆధ్వర్యంలో 12 వ రోజుకు చేరుకుంది,, సమ్మె శిబిరంలో మున్సిపల్ కార్మికులు వంటా,వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది,,. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు, ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ మాట్లాడుతూ…. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలను అంటురోగాల భారీ నుండి కాపాడే పరిశుద్ధ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు ఉండి గుడ్డివాని లాగా వివరిస్తున్నదని,, మున్సిపల్ కార్మికులు గొంతేమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయమని అడుగుతున్నారని, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేడు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన మాట తప్పాడు, మడమ తిప్పాడని, కరోనాకాలంలో మున్సిపల్ కార్మికులు చేసిన సేవను రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి గుర్తు చేసుకోవాలని, సమ్మె కారణంగా పట్టణాలలో పారిశుద్ధ్యం లోపించిందని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అటు పట్టణ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని,మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో మున్సిపల్ కార్మికులు చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో ఆటో వర్కర్స్ యూనియన్ వారికి తోడుగా ఉంటుందని ఆయన అన్నారు,,, కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి జే మోహన్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు శాంతన్న, మనోహర్ అమ్మ, లక్ష్మీదేవి, సూర్య శేఖర్, గోపాల్, అచ్చమ్మ, గ్రేస్ అమ్మ, దుర్గ తదితరులు పాల్గొన్నారు

 

municipal workers strike 12th day protest atp

  • సమస్యల పరిష్కారానికి కార్మికుల శీర్షాసనం

అనంతపురం కార్పొరేషన్ : 12 రోజులుగా పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్ల ల సాధనకై నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు శీర్షాసనం వేసి నిరసన వ్యక్తం చేశారు శనివారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో కార్మికులు తలకిందులుగా నిలబడి వినూత్న రీతిలో తమ తమ నిరసన తెలిపారు మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె 12 వ రోజు మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికులు తలకిందులుగా నిలబడి మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావం, తెలిపిన, సిపిఎం పార్టీ ఒకటో పట్టణ కార్యదర్శి రామిరెడ్డి రెండో పట్టణ కార్యదర్శి ఆర్ వి నాయుడు మాట్లాడుతూ 12 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి గా వ్యవహరిస్తుందని అన్నారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి చెత్తనంతా జెసిబి ట్రాక్టర్ తో క్లీన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు దాదాపు 25 లక్షల ప్రజాధనం స్వాహా చేసేందుకు అధికారులు ఫైల్స్ సిద్ధం చేస్తున్నారని అన్నారు కొంతమంది కార్పొరేటర్లు అధికార యంత్రాంగం ఇదే అదనుగా ప్రజాధనం దోచుకోవడానికి సిద్ధం కావటం సిగ్గుచేటు అన్నారు. అలాగే గత ఏడాది డిసెంబర్లో నడివి వంకకు వరదలు వచ్చి నడిమి వంకకు వరదలు వచ్చి కాలనీలు మునిగిపోయి 15 రోజులుగా వరద నీటిలోనే ఉండిపోయారు అన్నారు. కనీసం ఒక తాగునీటి ప్యాకెట్ ఒక బియ్యం ప్యాకెట్ కూడా సరఫరా చేయని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 23 లక్షల రూపాయలు వరద నీటి ప్రాంతాల ప్రజల భోజనాలకు ఖర్చు చేసినట్లుగా బిల్లులు ప్రతిపాదించడం చూస్తే ప్రజాధనం దోచుకోవడానిక అధికారులు కొంతమంది కార్పొరేటర్లు కుమ్మక్కైన తీరు సభ్య సమాజాన్నికి తల దించుకునేలా చేసిందన్నారు. మానవతావాదులు దాతలు ప్రజలకు తమ వంతుగా భోజనీకి భోజన ప్యాకెట్లు తాగునీటి ప్యాకెట్లు అందజేసి తమ ఉదాహరతను చాటుకున్నారని పేర్కొన్నారు. అలాంటిది కొంతమంది కార్పొరేటర్లు అధికారులు వరద నీటి ప్రాంత ప్రజలకు ఆహార తాగునీటి వసతి కల్పించినట్లుగా 23 లక్షల రూపాయలకు బిల్లులు సిద్ధం చేసి ప్రజాధనం దోచుకోవటం చూస్తే అధికారం పార్టీ దిగజారుడుతనం ధన దాహం తెలుస్తోందన్నారు. అయితే కార్మికులు తమ ప్రాణాలకు తెగించి ప్రజాసేవే పరమావధిగా ఎంచి ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఎవరూ చేయలేని పనిని ధైర్యంగా చేస్తూ ప్రజల మన్ననలను చూరగొంటున్నారని అన్నారు. కానీ కార్మికుల కు 26వేల రూపాయలు వేతనం ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగాలను పర్మినెట్ చేయాలని న్యాయమైన డిమాండ్లను సాధించుకోవటానికి 12 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న పాలకవర్గానికి అధికారులకు చీమకుట్టినట్టైనా లేదన్నారు పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించే పారిశుధ్య పనులను కార్పొరేటర్లు అధికారులు నిర్వహించే సత్తా ఉందా అని ప్రశ్నించారు ఫ్యాన్ కింద ఉంటూ కదా అప్పుడు ఉపన్యాసాలు ఇచ్చే వారికే కార్మికుల కష్టాలు సమస్యలు ఎలా అర్థమవుతాయని ప్రశ్నలు సంధించారు అధికార యంత్రాంగం ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకొని కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలబడాలని కోరారు. ఈ సమ్మెకు సంఘీభావం తెలిపిన ఒకటో పట్టణ కార్యదర్శి వెంకట్ నారాయణ రెండో పట్టణ కార్యదర్శి ముర్తుజా, ఆవాజ్ సభ్యులు వలిముష్కిన్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నల్లప్ప ఇంజనీరింగ్ నాయకులు పోతులయ్య మురళి నగర అధ్యక్ష కార్యదర్శులు బండారి ఎర్రి స్వామి సాకే తిరుమలేష్ లక్ష్మీ నరసమ్మ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

municipal workers strike 12th day protest annam

  • సిఐటియు జిల్లా అధ్యక్షులు అరెస్టు, విడుదల

అన్నమయ్య జిల్లా-రాజంపేట అర్బన్ : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 11వ రోజు శనివారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు పురపాలక కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కూర్చుని తమకు న్యాయం చేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. పట్టణ ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పోలీసులు, స్పెషల్ ఫోర్స్ తో మునిసిపల్ కార్మికులను బలవంతంగా బయటకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులకు కార్మికులకు మధ్య కొంతసేపు తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పోలీసు బలగాలు కార్మికులను బలవంతంగా బయటకు లాక్కొని వెళ్లారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ ను వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకొని వాహనానికి అడ్డంగా నిలబడ్డారు. కార్మికులను ముందుకు రానివ్వకుండా గేటుకు తాళాలు వేసి పోలీసులు రవికుమార్ను తమ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్మికులంతా ఏకమై నినాదాలు చేసుకుంటూ పొరపాలక కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లడంతో రవికుమార్ ను వెంటనే విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని తమ న్యాయమైన డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండా న్యాయబద్ధంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై పోలీసులతో ఉద్యమాన్ని ఆపాలని చూడడం సరికాదని అన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె ఆగదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ఓబయ్య, నాయకురాలు లక్ష్మీదేవి, కార్మికులు రమణ, ప్రసాద్, రెడ్డయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

municipal workers strike 12th day protest vsp b

విశాఖ : మున్సిపల్ కార్మికులు జగదాంబ జంక్షన్ నుంచి జీవీఎంసీ వరకు ర్యాలీ నిర్వహిస్తుండగా పాత జైల్ రోడ్ జంక్షన్ దగ్గర అరెస్ట్ చేస్తున్న పోలీసులు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, సిఐటియు నాయకులు ఆర్కే, ఎస్ వి కుమార్, మున్సిపల్ నాయకులు వెంకటరెడ్డి,  కృష్ణారావు, కే కుమారి, తదితరులు అరెస్ట్ చేశారు.

 

municipal workers strike 12th day protest arrest

  • మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు

ముఖ్యనేతలు ముందస్తు అరెస్టు

విజయనగరం జిల్లా – బొబ్బిలి : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అద్యక్షులు జి.గౌరీష్, మరో ముగ్గురు కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని శంకరరావు అన్నారు. అక్రమ అరెస్టులు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని కోరారు. లేనిచో పోరాటం ఉదృతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

 

మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ 12వ రోజు మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్ గౌస్, కోశాధికారి వెంకట లింగం, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, భాస్కరాచారి, నాయకులు ఆదాము, రామకృష్ణ, రామాంజనేయులు, నాగేశ్వరరావు, సిద్దయ్యలతోపాటు మున్సిపల్ కార్మికులు పాల్గొనడం జరిగింది.

విజయనగరం జిల్లా – నెల్లిమర్ల : మున్సిపల్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత… సుమారు 15 మంది పోటీ కార్మికులను పట్టుకు వచ్చిన అధికారులు, మా సమ్మెను విచ్చనం చేసే కార్యక్రమం ఆపాలి అనీ, పోటీ కార్మికుల వచ్చి సమ్మెకు మద్దతు ఇస్తామని చేప్పైన… కొంత మంది కొత్త డ్రైవర్ నీ తీసుకువచ్చి బండి తీసే ప్రయత్నం చేస్తే… సుమారు గంటకీ పైగా మున్సిపల్ కార్మికుల పోరాడి బండి వెనక్కి తీసి.. పోటీ కార్మికులను వెనక్కి పంపించి.. పోటీ కార్మికులను తీసుకువచ్చే మా పొట్ట కొట్టదు అనీ.. మాకు కనీస వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, cps రద్దు చేయాలని, చనిపోయిన తుపాకుల రమణమ్మ ఇంటిలో ఒకరికి జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రవి కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధనకార్యదర్శి కె సురేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షడు బుర్లి రమణ, హరిబాబు, శ్రీను, గౌరీ, లక్ష్మీ, రాము, సరస్వతి,  బాబురావు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయం సిబ్బందినీ అడ్డుకున్నారు.

విజయనగరం టౌన్ : మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సి ఐ టి యు ) ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 10 గంటల నుంచి నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం గేటు వద్ద ముట్టడి సాగిస్తున్నారు. సమ్మెకు సహకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సరెండర్ లేవు డబ్బులు ఇవ్వాలని, ప్రభుత్వ మొండి వైఖరి నసించలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏ.జగనొహాన్, రెడ్డి శంకరరావు కార్మికులు పాల్గొన్నారు.

ఒంగోలులో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తం… 12వ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ముట్టడించిన కార్మికులు. కార్మిక నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం. సిఐటియు నాయకులను పోలీస్ జీపు ఎక్కించడంతో జీపుకు అడ్డంగా కూర్చున్న కార్మికులు. కార్మిక నాయకులను జీపు దించేంతవరకు నిరసన వ్యక్తం చేసిన కార్మికులు. కార్మిక నాయకులను జీపు దించేసి వెళ్లిపోయిన పోలీసులు. ముట్టడి వద్దకు వచ్చిన కమిషనర్ వెంకటేశ్వరరావు.స్థానిక సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ.

 

municipal workers strike 12th day protest sklm

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు

 

municipal workers strike 12th day protest sklm a

పలాస మున్సిపల్ కార్యాలయం గేటు ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టడంతో మున్సిపల్ అధికారులు కార్యాలయం లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు బయట ఉండాల్సి వచ్చింది.

 

municipal workers strike 12th day protest

ఏలూరు : శుక్రవారం ఏలూరు పంపులు చెరువు వద్ద ఉన్న వెహికల్ డిపో వద్ద మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులకు నిరసనగా శనివారం మున్సిపల్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించిన కార్మికులు.

➡️