పిఠాపురం చేరుకున్నపవన్‌

Mar 30,2024 16:00 #JanaSena, #Kakinada, #pavan kalyan

ప్రజాశక్తి-పిఠాపురం : జనసేన అధినేత పవన్ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా శనివారం పిఠాపురం చేరుకున్నారు. గొల్లప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ లో ల్యాండ్ అయ్యారు. పవన్ ను చూసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. పవన్ కు కాకినాడ ఎంపి అభ్యర్థి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్,కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, మాధురి నాయుడు, డాక్టర్ పిల్లా శ్రీధర్,వర్మ తనయుడు గిరీష్ లు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కారు లోంచి అభివాదం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో గొల్లప్రోలు నుంచి పి దొంతమూరు గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ వర్మ నివాసానికి వెళ్ళారు. ఆయనతో భేటీ అనంతరం సాయంత్రం ఐదు గంటలకు చేబ్రోలులోని రామాలయం సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన వారాహి విజయ్ బేరి యాత్రలో పాల్గొని ప్రసంగిస్తారు.

➡️