పవన్‌ పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ : మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ అని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు విమర్శించారు. ఎన్నికల అనంతరం ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాలకే పరిమితం కావడమో, విదేశాలకు వెళ్లిపోవడమో జరుగుతుందని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు సిఎం జగన్‌ వెన్నంటే ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాపులకు నిజమైన నేస్తం జగన్‌ అని వైసిపి నాయకులు అడపా శేషు అన్నారు. పవన్‌ రాజకీయంగా పనికిరారని వైసిపి గ్రీవెన్స్‌ సెల్‌ ఛైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి విమర్శించారు.

➡️