దేశంలోనే ధనిక అభ్యర్థిగా పెమ్మసాని

  • రూ.5700 కోట్ల ఆస్తి ఉన్నట్టు అఫిడవిట్‌లో వెల్లడి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు లోక్‌సభ టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తన ఆస్తి మొత్తం రూ.5700 కోట్లుగా సోమవారం నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చంద్రశేఖర్‌కు రూ,2,316 కోట్ల విలువైన చరాస్తులుండగా, భార్య శ్రీరత్న పేరిట రూ.2,280 కోట్లు చరాస్తులు ఉన్నాయి. భార్యభర్తలిద్దరికి చెరో రూ.1200 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్టు తెలిపారు. చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నట్టు చూపారు. 6.86 కిలోల బంగారు ఆభరణాలు, రూ.6.11 కోట్ల విలువైన నాలుగు కార్లు, గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగుభూమి, హైదరాబాద్‌లో రూ.2.28 కోట్లు విలువైన భూమి, రూ.29.73 కోట్ల వాణిజ్య భవన సముదాయం, ఢిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం, అమెరికాలో రూ.28.26 కోట్ల విలువైన నివాస భూములు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపారు. భార్య శ్రీరత్న పేరిట రూ.2.33 కోట్ల విలువైన భూమి, అమెరికాలో రూ.6.82 కోట్ల భూమి ఉన్నట్టు పేర్కొన్నారు.

➡️