ఎపి భవన్‌లో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో మహాత్మా జ్యోతి బా ఫూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం నాడిక్కడ ఎపి భవన్‌లోని బిఆర్‌ అంబేద్కర్‌ ఆడిటోరియంలో మహాత్మా జ్యోతి బా ఫూలే 197వ జయంతి వేడుకలు జరిగాయి. రెసిడెంట్‌ కమిషనర్‌ (ఆర్‌సి) లవ్‌ అగర్వాల్‌, అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (ఎఆర్‌సి) హిమాంశు కౌశిక్‌ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లవ్‌ అగర్వాల్‌ జ్యోతి ప్రజ్వలన చేసి, ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఫూలే సంఘ సంస్కర్త అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ అధికారులు, సిబ్బంది, అతిథులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఫూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

➡️