మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

Mar 5,2024 10:38 #hyderabad, #PM Modi, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ప్రధాని బేగంపేటకు బయల్దేరారు. బేగంపేట నుంచి సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులను మోడీ ప్రారంభించనున్నారు. రూ.9,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను మోడీ చేయనున్నారు. అనంతరం పటేల్‌ గూడలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొంటారు.

➡️