భారీ వర్షం వల్ల రద్దు అయిన రాహుల్‌ గాంధీ సభ

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పొద్దంతా భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలు చోట్ల టెంట్లు కుప్పకూలి పోయాయి. సమయానికి టెంట్ల కింద ఎవరు లేక పోవడంతో పెను తప్పిన ప్రమాదం తప్పింది. దీంతో కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి సభ రద్దు అయింది. కాగా, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధన్యం తడిసిపోయింది. చెట్లు విరిగి పడటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

➡️