‘కాంగ్రెస్‌ 420 హామీలు’ పేరుతో బిఆర్‌ఎస్‌ బుక్‌లెట్‌ విడుదల

Jan 3,2024 14:41 #avishkarana, #book let, #brs

హైదరాబాద్‌: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై బిఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రజలకు గుర్తు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘కాంగ్రెస్‌ 420 హామీలు’ పేరుతో బుక్‌లెట్‌ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రాక ముందే మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చాలని పేర్కొంది. అలాగే ఇటీవల విడుదల చేసిన ‘స్వేతపత్రం’ ప్రతిని కూడా నేతలకు పార్టీ అందించింది. తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివఅద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని వివరిస్తూనే.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడిపై పెంచేలా ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్‌ హామీలు అమలులో ఆలస్యం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేసింది.

➡️