స్పందన ఇకపై పిజిఆర్‌ఎస్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రజా ఫిర్యాదులు నమోదు వాటి పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ”స్పందన” కార్యక్రమాన్ని పిజిఆర్‌ఎస్‌గా ప్రభుత్వం పేరు మార్చింది. ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ా పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రస్సల్‌ సిస్టమ్‌ (పిజిఆర్‌ఎస్‌) పిలుస్తారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారమే పరమావధిగా అధికారులు పనిచేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఉత్తర్వులు వెలువరించిన వెనువెంటనే ఫిర్యాదుల నమోదు https://spandana.ap.gov.in/వెబ్‌సైట్‌లోనూ పిజిఆర్‌ఎస్‌గా మార్పులు చేశారు. అయితే వెబ్‌సైట్‌ యుఆర్‌ఎల్‌ మాత్రం స్పందన.ఎపి.గవ్‌.ఇన్‌గానే ఉండటం విశేషం.

➡️