దేవరాజుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

Dec 22,2023 17:24 #Prakasam District, #road accident
road accident in prakasam

ప్రజాశక్తి-ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల కన్నీటితో ఆ ప్రాంతం విషాదంగా మారింది.

➡️