విశాఖలో అదుపుతప్పిన కారు – మహిళ మృతి

Feb 17,2024 13:02 #road accident, #Visakha
road accident in visakha

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ  : విశాఖపట్నం నగరంలోని ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో కేఆర్ఎం కాలనీ అతి సమీపంలో ఉన్న రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంఘటన వివరాల్లోకి వెళితే… సీతమ్మధార వైపు నుండి జాతీయ రహదారి వెళ్లే మార్గం లో వచ్చిన AP 31 EO 8811 మారుతి వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న నివాస గృహాన్ని రోడ్డు పక్కన పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పోలిశెట్టి జగదీశ్వరి (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. డ్రైవర్ కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది సంఘటన స్థలానికి చేరుకున్న ఎంవిపి పోలీసులు మృతదేహాన్ని కేజిహెచ్ మార్చురీకి తరలించారు.

➡️