అధిక వర్షాలతో నిలిచిన అంతర్ జిల్లాల రాకపోకలు

road blocks due to heavy rains

నిలిచిపోయిన రవాణా వ్యవస్థ.
ప్రజలకు తప్పని ఇబ్బందులు.

ప్రజాశక్తి-కోటనందూరు : గత మూడు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కొండల ప్రాంతాల నుండి దిగువ ప్రాంతానికి వర్షపు నీరు ప్రవహిస్తుంది. దీంతో కాకినాడ, అనకాపల్లి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామ శివారు ఉప్పరగూడెం వద్ద ఎదురుల గడ్డ వాగుపై ఉన్న బ్రిడ్జిపై నుండి వర్షపునీరు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో బస్సులో ప్రయాణి ప్రయాణిస్తున్న ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన రహదారి అయిన తుని నర్సీపట్నం రహదారి పై వాహనాలు ఎక్కడికి భారీగా నిలిచిపోవడంతో నిలిచిపోయాయి. స్థానిక ఎస్సై బి.శంకర్రావు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ వేరే రహదారుల ద్వారా తరలిస్తున్నారు. బ్రిడ్జి వద్ద పోలీస్ సిబ్బందిని పహారా ఉంచారు. సుమారు 36 గ్రామాల ప్రజలు నిత్యవసర వస్తువులు చేరకపోవడంతో ఇబ్బందులు గురవుతున్నారు.

➡️