పోరాటాలు… విజయాలు

Dec 29,2023 09:42 #maha sabha, #SFI
sfi maha sabha discussion

 

జిల్లాల వారీ చర్చల్లో అనుభవాలు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభలు సందర్భంగా రెండోరోజు గురువారం ఆయా జిల్లాలకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా గుంటూరు నుంచి నవిత మాట్లాడుతూ… ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం ఫలితంగా ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు తగ్గించారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమంలో మరింత మెరుగుపడడానికి సంఘంలో ఉన్నవారికి మూడుసార్లు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. స్టడీ సర్కిల్స్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. శ్రీ అనంతపురం జిల్లాకు చెందిన నరేంద్ర, వంశీ, పవిత్ర మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సుమారు రెండువేల మందితో అనంతపురం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించామన్నారు. కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ఉన్న విద్యార్థుల కోసం సమయానికి అనుకూలంగా బడి బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన చేయగా అధికారులు బస్సులను ఏర్పాటు చేశారన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాకు చెందిన గోపి నాయుడు, యమునా మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ ఇచ్చిన అన్ని పిలుపులను సక్రమంగా అమలు చేసి విద్యారంగ సమస్యలపై ధర్నాలు చేపట్టామన్నారు. ప్రధానంగా సంక్షేమ వసతి గృహాల్లో కేంద్రీకరించి పనిచేయడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు.శ్రీ కర్నూలు జిల్లా నుంచి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కర్నూలు కేంద్రంలో ఉన్న కెవిఆర్‌ కళాశాలకు హాస్టల్‌ ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమాలు చేసి సమస్యను పరిష్కరించుకోగలిగామన్నారు. ఆదోని పట్టణంలో నిర్వహించిన ఉచిత ఎంసెట్‌ కోచింగ్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. శ్రీ అల్లూరి జిల్లా నుంచి చిన్నారావు మాట్లాడుతూ.. జిఒ 3 అమలు చేయాలని 42 రోజులుగా దీక్షలు చేశామన్నారు. ఏజెన్సీలో విద్యార్థుల మరణాలను అరికట్టాలని, స్పెషల్‌ డిఎస్‌సి ద్వారా పోస్టులను భర్తీ చేయాలని, డిగ్రీ, ఇంటర్‌ ఫీజులు తగ్గించాలని, హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయాలని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించమన్నారు. పాడేరు నుంచి బంగారు చిట్టి మాట్లాడుతూ.. ప్రైవేటు కళాశాలలు నియమ నిబంధనలను పాటించాలని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయగా కొన్ని ప్రయివేటు కళాశాలలకు అధికారులు రూ.మూడు లక్షలు జరిమానా విధించారని తెలిపారు. శ్రీ చిత్తూరు జిల్లా నుంచి వినోద్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలు ఫలితంగా సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు నియంత్రణ కోసం పోరాటాలు జరపగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు.శ్రీ విశాఖపట్నం జిల్లా నుంచి పల్లవి మాట్లాడుతూ.. పబ్లిక్‌ హాలిడేస్‌లో తరగతులు నిర్వహిస్తున్న ప్రయివేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేయగా అధికారులు స్పందించి వాటిని నిలుపుదలు చేయించారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం దశలవారీగా ఉద్యమాలు చేశామని తెలిపారు. రంగాలవారి చర్చల ప్రజెంటేషన్‌రంగాల వారీ చర్చల్లో భాగంగా విద్యార్థినిల రంగం నుంచి ప్రతినిధులు మాట్లాడుతూ.. సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా హాస్టల్స్‌లో సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. రెజ్లర్లపై జరిగిన దాడులపై వారి ఉద్యమానికి మద్దతుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించమన్నారు. మణిపూర్‌ మారణహోమంపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశామన్నారు. మలాలా డే సందర్భంగా సెమినార్లు, సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. శానిటరీ ప్యాడ్స్‌ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి కలెక్టర్లకు వినతి పత్రాలు అందించామన్నారు. శ్రీ సంక్షేమ హాస్టళ్ల రంగంపై ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐగా వసతిగృహాల్లో సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక ఆందోళనలు నిర్వహించి కొన్ని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకోగలిగామన్నారు.శ్రీ సాంస్కృతిక రంగానికి సంబంధించి ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో సాంస్కృతిక రంగంలో కమిటీలను ఏర్పాటు చేసి కళారంగానికి సంబంధించి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సోషల్‌ మీడియాలో రంగానికి సంబంధించి సాగర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 37 ఫేస్‌బుక్‌ పేజీలను, 47 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను, 1,200 వాట్సాప్‌ గ్రూపులను, నాలుగు యూట్యూబ్‌ ఛానళ్లు, నాలుగు ట్విట్టర్‌ ఖాతాలను నడుపుతున్నట్లు తెలిపారు. మొత్తంగా సుమారు రెండు లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారన్నారు.

  • స్థానిక సమస్యలపై పోరాడాలి :   నేతల సౌహార్ధ

ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభ సందర్భంగా సోదర విద్యార్థి సంఘాలతో పాటు వివిధ ప్రజాసంఘాల నేతలు సందేశాలు ఇచ్చారు. శ్రీ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ.. నాటి విశాఖ ఉక్కు ఉద్యమం నుంచి నేడు మళ్లీ విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం కార్మికులతో పాటుగా విద్యార్థులు కూడా పోరాటాలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో సిఐటియు కూడా నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందన్నారు. శ్రీ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యారంగంలో కాషాయీకరణను ప్రవేశపెట్టి ప్రజలను మూడు వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లేందుకు బిజెపి ప్రయత్నం చేస్తోందన్నారు. శ్రీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాల వలన వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. శ్రీ ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, హక్కులు సాధన కోసం రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు చేయాలని, ఈ మహాసభల్లో సమస్యలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని వామపక్ష విద్యార్థి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. శ్రీ ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులు, రైతులు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. శ్రీ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనిరు రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి మాట్లాడుతూ..అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు ఇస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ తీర్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్‌.రమణి మాట్లాడుతూ.. సామాజిక సమస్యల పరిష్కారానికి విద్యార్థులు, మహిళలు కలిసి పోరాడాలని కోరారు. శ్రీ జెవివి రాష్ట్ర నాయకులు కెఎంఎంఆర్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథం వైపు విద్యార్థులు ఆలోచించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

➡️