మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటి ముట్టడి..

Feb 18,2024 12:24 #Congress, #Dharna, #Mega DSC, #visaka

ప్రజాశక్తి-విశాఖ : మెగా డీఎస్సీ కోసం విశాఖలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అంటూ నినదించారు. ఈ క్రమంలో మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. నాయకులను అరెస్ట్‌ చేసి స్టీల్‌ ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు.

➡️