టిడిపి, జనసేన సభ సైడ్‌లైట్స్‌

Feb 29,2024 08:37 #meeting, #tdp -janasena
TDP, Jana Sena Sabha sidelights
  • ఆలస్యంగా ప్రారంభమైన సభ : తెలుగు విజయకేతనం జెండా సభ అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం మూడుగంటలకు ప్రారంభమవుతుందని చెప్పినా ఐదుగంటలకు మొదలైంది. నాలుగు గంటల తరువాత మాత్రమే కార్యకర్తలు ప్రారగణం వద్దకు చేరుకున్నారు. తొలుత చంద్రబాబు రాగా, అనంతరం పవన్‌కల్యాణ్‌ వచ్చారు. ఇద్దరూ వేదికపై కార్యకర్తలకు అభివాదం చేశారు. చంద్రబాబు జనసేన జెండా, పవన్‌ కల్యాణ్‌ టిడిపి జెండా పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేశారు.
  • నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తానే మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని సభలో ప్రకటించినప్పుడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి ఏదో మాట్లాడుకోవడం కనిపించింది.
  • నందమూరి బాలకృష్ణ ప్రసంగం స్పష్టంగా లేకపోవడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.
  • పెద్ద ఎత్తున తోపులాట జరిగి బారికేడ్లు పడగొట్టి స్జేజీ ఎదురుగా యువత చేరుకోవడంతో కొంతసేపు గొందరగోళం నెలకొంది. దీంతో, క్రమశిక్షణతో ఉండాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కోరారు.
  • సభ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో జనం ముందుగానే తిరుగుముఖం పట్టారు.
  • పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో తాడేపల్లిగూడెం బైపాస్‌పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
  • నాలుగు గంటల వరకు ఎండ కారణంగా జనం రాకపోవడంతో టిడిపి, జనసేన నాయకుల్లో కొంత ఆందోళన నెలకొంది. తర్వాత జనం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
  • కేరళలో సిపిఎం దాదాపు 30 సంవత్సరాల నుంచి గెలుస్తోంది. ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ గెలుస్తున్నారు. సుస్థిర ప్రభుత్వాలు గెలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా మన రాష్ట్రంలోని ప్రజానీకమూ ఆలోచించాలని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎంఎ.షరీఫ్‌ కోరారు.
  • స్జేజీపై దాదాపు 500 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాటు చేయడంతో ముఖ్య నేతలతోపాటు అభ్యర్థులూ వేదికపై ఆశీనులయ్యారు.

 

➡️