వైసిపి వర్గీయుల దాడిలో గాయపడ్డ టిడిపి కార్యకర్త మృతి

Mar 19,2024 10:13 #attack, #died, #injured, #TDP, #worker, #YCP

గిద్దలూరు (ప్రకాశం) : వైసిపి వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన టిడిపి కార్యకర్త మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికొట పంచాయతీలోని పరమేశ్వర్‌ నగర్‌ లో మునయ్య అనే కార్యకర్త తెలుగుదేశం పార్టీ వైపు తిరుగుతున్నాడని ఆగ్రహంతో వైసిపి వర్గీయులు అతడిపై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో మునయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులో చికిత్స పొందుతున్న మునయ్య ఈరోజు తెల్లవారుజామున మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️