తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు – ప్రమాణ స్వీకారాలు

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. 3వ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా సిఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ప్రమాణం చేశారు. తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసదుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. కెసిఆర్‌కు శుక్రవారం సర్జరీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెసిఆర్‌తో కెటిఆర్‌ తొలిరోజు సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో తాము ప్రమాణ స్వీకారం చేసేందుకు మరోసారి సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కోరారు. ఇదిలా ఉండగా, ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీని నియమించడంపై బిజెపి ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో ప్రమాణస్వీకారానికి బిజెపి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. రెగ్యులర్‌ స్పీకర్‌ ఎన్నికయ్యాక తాము ప్రమాణ స్వీకారం చేస్తామని ప్రకటించారు.

➡️