ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత

Apr 5,2024 19:08 #2024 ipl, #Cricket, #csk vs srh

హైదరాబాద్‌: మ్యాచ్‌ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ ఉప్పల్‌ స్టేడియం వద్ద క్రికెట్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్‌ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.

➡️