గుంటూరులో ఉద్రిక్తత : కార్మిక ప్రజాసంఘాల నాయకులు అరెస్ట్‌

గుంటూరు : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించటాన్ని నిరసిస్తూ … కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. కార్మిక ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు. స్థానిక మార్కెట్‌ సెంటర్‌ నుండి శంకర్‌ విలాస్‌ సెంటర్‌ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి, శంకర్‌ విలాస్‌ బ్రిడ్జి వద్ద కార్మిక సంఘాలు రాస్తారోకోకు దిగాయి. దీంతో పోలీసులు బలవంతంగా నాయకులను వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

➡️