ఫీజు కట్టలేదని 30 మంది విద్యార్థినులను గేంటేసిన యాజమాన్యం

Dec 16,2023 16:50 #Dharna, #narsing students

నెల్లూరు: జిల్లాలోని కావలిలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల శ్రీసాయి నర్సింగ్‌ కళాశాల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. ఫీజు కట్టలేదని 30 మంది విద్యార్థినిలను కళాశాల నుంచి యాజమాన్యం గెంటేసింది. విద్యార్థినిలు నర్సింగ్‌ తఅతీయ సంవత్సరం చదువుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులని వసూలు చేసుకుని కూడా రూ.50వేలు కట్టాలని డిమాండ్‌ చేశారు. ఎగ్జామ్‌ ఫీస్‌ కట్టించుకోకుండా వేధింపులు గురిచేశారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన విద్యార్థినిని రెండు రోజుల కిందట యాజమాన్యం హాస్టల్‌ నుంచి బయటకి పంపించేసింది. దీంతో విద్యార్థినిలు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలిసిన కావలి ఎమ్మార్వో మాధవరెడ్డి కాలేజీ వద్దకి చేరుకున్నారు.

➡️