కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

అమరావతి : సిఎం వైఎస్‌.జగన్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై చర్చిస్తోంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రూ.3 వేలు పెన్షన్‌ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఆరోగ్యశ్రీని రూ. 25 లక్షలకు విస్తరించే నిర్ణయం, కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు ఆమోదం, తుపాను నష్టం, ప్రభుత్వ సహాయంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

➡️