ఎన్నికల విధుల్లో సొమ్మసిల్లి పడిపోయిన పోలింగ్‌ ఆఫీసర్‌

May 12,2024 10:50 #2024 elections, #vijayanagaram

ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : నెల్లిమర్ల నియోజవర్గం కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లో పోలింగ్‌ విధి నిర్వహణకు వచ్చిన పోలింగ్‌ ఆఫీసర్‌ శ్రీ మాధవన్‌ ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి ఉద్యోగులు వచ్చి సపర్యలు చేశారు. మెడికల్‌ సిబ్బంది వైద్య పరిక్షలు చేశారు. ఆయన పూసపాటి రేగ మండలం పశుపాంలో పోలింగ్‌ అధికారిగా విధులు నిర్వహించాల్సి ఉంది. దత్తి రాజేరు మండలం పెదకాద ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శ్రీ మాధవన్‌ సొమ్మసిల్లి పడిపోయి గంట సేపు అయినప్పటికీ పక్కనే వున్న రిటర్నింగ్‌ అధికారి నూకరాజు కనీసం పట్టించుకోకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️