రాజ్యాంగాన్ని కాషాయీకరణ చేస్తున్న బిజెపి

Apr 23,2024 15:34 #2024 elections, #Nellor
  • మతసామరస్యం కోసం నిలబడేది ‘సిపిఎం’
  • సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌

ప్రజాశక్తి-నెల్లూరు : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చివేసి కాషాయీకరణ చేస్తుందని, రాజ్యాంగంలోని సెక్యూలర్‌ విధానాలను కాపాడుకోవాలంటూ ఇంటియా కూటమి అభ్యర్ధులను తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ ఎంఎ.గఫూర్‌ అన్నారు. నగర నియోజకవ ర్గ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ విసికె పార్టీలు బలపరిచిన సిపిఐ(ఎం) అభ్యర్థి మూలం రమేష్‌ మంగళ వారం నామినేషన్‌ దాఖాలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ఏబీఎం కాంపౌండ్‌ నుంచి విఆర్సి సెంటర్‌ వరకు సిపిఎం పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, సాను భూతిపరులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ ఎ్యలు, మాజీ ఎంఎల్‌ ఎం.ఎ గఫూర్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం చేస్తుందని, మతసామరస్యం కోసం నిలబడుతుందని, మన దేశం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, అందరూ అన్నదమ్ముల వలే జీవించే దేశమన్నారు. ఒక రంగుల హరివిల్లులాగా, అనేక బాషలు, అనేక సంస్కతులు ఉండే దేశంలో బిజెపి అధికారం కోసం చిచ్చుబెట్టి, అన్నదమ్ముల మద్య తగాదాలు పెట్టి రాజ కీయ లబ్దిపొందాలని కుట్రలు పన్నుతుందన్నారు. ఇండియా కూటమి గెలుపుతోనే బిజెపి దుర్మార్గపు పాలనను సమాధి కట్టగలన్నారు. దేశ ప్రజలను, దేశ రాజ్యాంగాన్ని, సెక్యూలర్‌ విధానాన్ని కాపాడుకోవాలంటే ఇదిఒక్కటే మార్గం తప్ప మరో మార్గం లేదన్నారు. బిజెపి గెలిస్తే భారత రాజ్యాంగం, రాజ్యాంగంగా ఉండదన్నారు. భారత రాజ్యాంగం మార్చివేయబడు తుందని, రాజ్యాంగంలో ఉన్న సెక్యూలర్‌ పదాలను తొలగిస్తారన్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పౌరులకు ఉం డే హక్కును కోల్పోతారన్నారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు ఎంతో ప్రధాన్యత ఉందని, పోరపాటు అనేది జరిగితే ప్రజలందరూ తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రతి ఇంటికి సందేశాన్ని తీసుకెళ్లి ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు పతి ఒక్కరు కషి చేయాలన్నారు.

అనంతరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న మూలం రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజలపై ఆర్థిక భారాలు మోపింది బిజెపి ప్రభుత్వమని, అందుకు రాష్ట్రలో అధికారంలో ఉన్న వైసిపి, టిడిపి రెండు మద్దతు ఇచ్చాయన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం కీలక భూమిక పోషించిందన్నారు. చట్ట సభల్లో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రశ్నించే అభ్యర్థులను గెలిపించి పంపించాలన్నారు. పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పోలు రాజు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధి కారంలోకి వస్తే దేశంలో సమానత్వం అనేది మరుగౌతుందన్నారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి వామపక్షపార్టీ లు అండగా నిలిచి ప్రభుత్వ పాలనకు సహకరించడంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం సాధ్యమైందనా ్నరు. నేడు తిరిగి మరలా అటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసేకొనేందుకు అవకాశం వచ్చిందన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి అన్న దానితో నిమిత్తం లేకుండా.. చట్ట సభల్లో మన గొంతు వినిపి ంచాలన్నా.. ప్రజా సమస్యలు పరిష్కరింపబడాలి అంటే తప్పని సరిగా ప్రతి ఒక్కరు సిపిఎంకు ఓటు వేయడం ద్వారానే సా ధ్యమౌతుందన్నారు. ప్రజలు సిపిఎంకు ఓటు వేస్తే అది అధికార పక్షానికో.. ప్రతిపక్షానికో కాదని, రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నా య రాజకీయం, ప్రజల రాజకీయం గెలవాలంటే సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ గెలిపించుకోవాలన్నారు. ఈ సభా కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అధ్యక్షత వహిం చారు. అనంతరం కార్పోరేషన్‌ కార్యాలయం ఆవరణంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాట చేసిన నామినేషన్‌ స్వీకరణ విభాగానికి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేరుకున్నారు.

అనంతరం రిటర్నింగ్‌ అధికారి వికాన్‌ మర్మతకు నగర నియోజకవరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ తన నామినేషన్పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవ రు దేవకుమార్‌ రెడ్డి, పార్టీ జిల్లా సెక్రెటిరియేట్‌ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, గోగుల శ్రీనివాసులు, కె.అజరు కుమార్‌ ,జొన్నలగడ్డ వెంకమరాజు, తుళ్లూరు గోపాల్‌, మూలి వెంగయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.

https://fb.watch/rC_R7O8jHm/

➡️