అసెంబ్లీకీ 15 మంది డాక్టర్లు

Dec 3,2023 21:25 #Assembly Elections, #Telangana

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో 15 మంది డాక్టర్లు విజయం సాధించారు. వీరిలో 11 మంది కాంగ్రెస్‌కు ఒకరు బిజెపికి, ముగ్గురు బిఆర్‌ఎస్‌కు చెందిన వారు గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారిలో డాక్టర్‌ రామ్‌ చందర్‌ నాయక్‌ (డోర్నకల్‌), డాక్టర్‌ వంశీ కృష్ణ (అచ్చంపేట), డాక్టర్‌ మురళీ నాయక్‌ (మహబూబాబాద్‌), డాక్టర్‌ సత్యనారాయణ (మానకొండూరు), డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌ (మెదక్‌), డాక్టర్‌ పర్ణిక రెడ్డి (నారాయణపేట్‌), డాక్టర్‌ సంజీవ రెడ్డి (నారాయణఖేడ్‌), డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి (చెన్నూరు), డాక్టర్‌ కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి (నాగర్‌ కర్నూల్‌), డాక్టర్‌ భూపతి రెడ్డి (నిజామాబాద్‌ రూరల్‌), డాక్టర్‌ రాగమయి (సత్తుపల్లి) ఉన్నారు. బిఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్‌ తెల్లం వెంకట్రావు (భద్రాచలం), డాక్టర్‌ కల్వకుంట్ల సంజరు (కోరుట్ల), డాక్టర్‌ సంజరు (జగిత్యాల), బిజెపి నుంచి డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌ (సిర్పూర్‌) గెలుపొందారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులు వృత్తిరీత్యా డాక్టర్లు కావడం విశేషం. మొత్తం అసెంబ్లీలో వీరు 17.85 శాతంగా ఉండటం గమనార్హం.

➡️