మధ్యాహ్నమైనా భోజనం లేదు-బ్యాంకు వద్దనే పింఛను కోసం పడిగాపులు

May 2,2024 14:22 #lunch, #Pensioners, #waiting

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : మండలంలోని రెండవ రోజు పింఛన్లు కోసం వృద్ధులు, మహిళలు మారుమూల ప్రాంతాల్లో నుంచి భారీ ఎత్తున పింఛన్లు తీసుకోవడం కోసం హుకుంపేట బరోడా బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నారు. అకౌంట్లులో డబ్బులు జమచేయడంతో డబ్బులు తీసుకునేందుకు తండోపతండాలుగా బరోడా బ్యాంకు ఖాతాలు ఉన్న ప్రతి వృద్ధులు, మహిళలు పింఛన్లు దారులు హుకుంపేట మండల కేంద్రంలో ఉన్న బరోడా బ్యాంకు వద్దకు బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు తీసుకోవడానికి రావడంతో బ్యాంకు చుట్టుపక్కల మొత్తం జనాలతో కిటకిటలాడింది. పింఛన్లు తీసుకోనే వరకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా బిపి, చెకప్‌ ఎండ తీవ్రత తలెత్తకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు నీళ్లు ఇవ్వడానికి రైతులంతా వాటిని అందుబాటులో ఉంచారు. హుకుంపేట పిహెచ్‌ సి సిబ్బంది ఎంఎల్‌ ఎస్పీ ఎస్‌.చంద్ర కళ, ఆశావర్కర్లు శాంతి ఉదయం నుండి సాయంత్రం 6గంటల వరకు షిప్టులవారీగా డ్యూటీ కి వస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు మేనేజర్‌ టెంటు నీరు ఏర్పాట్లు చేశారు. ఏది ఏదైనా గాని పంచాయతీ లోనే పింఛన్లు పంపిణీ చేయాలని మండల కేంద్రంలో బ్యాంకుల చుట్టు తిరగడానికి ఇబ్బందులుపడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. భోజనాలను లేకుండా పింఛన్లు కోసం ముసలివారు పడిగాపులు కాస్తున్నారు.

లకే చిన్నమ్మి,ఉక్కురుబ్బ తడిగిరి పంచాయతీ హుకుంపేట మండలం నడవడ లేక ఇంట్లొ ఉన్నా వృద్ధురాలు
లకే చిన్నమ్మి,ఉక్కురుబ్బ తడిగిరి పంచాయతీ హుకుంపేట మండలం నడవడ లేక ఇంట్లొ ఉన్నా వృద్ధురాలు
G, balanna, isukagaruvu villege thadigiri హుకుంపేట కళ్లు కనిపించ కనిపించక పోవడంతో ఇంట్లొ లొనే ఉన్నారు
G, balanna, isukagaruvu villege thadigiri హుకుంపేట కళ్లు కనిపించ కనిపించక పోవడంతో ఇంట్లొ లొనే ఉన్నారు

➡️