రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

ప్రజాశక్తి – నక్కపల్లి (అనకాపల్లి):లారీని కారు ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలోని వెదుళ్లపాలెం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు… విశాఖ జిల్లాలో గోపాలపట్నం ప్రాంతానికి చెందిన శరగడం వెంకటలక్ష్మి (45), ఆమె కుమారుడు వికాస్‌, బంధువైన కూర్మన్నపాలెంనకు చెందిన దాడి గగన్‌ (14), విశాఖపట్నంకు చెందిన సుంకర మధుకర్‌ (22) కారులో కాకినాడ బయలుదేరారు. నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం జంక్షన్‌ వద్ద వారి కారు టైరు పంచరయ్యింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్లే రోడ్డు మార్గంలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో తుని నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ కారును ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి, గగన్‌, మధుకర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న వికాస్‌ తీవ్రంగా గాయపడి అనకాపల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిఐ విజరు కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గగన్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మధుకర్‌ ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌లో అప్రెంటిస్‌ చేస్తున్నారు.

➡️