నేడు అంబేద్కర్‌ వర్ధంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

Dec 6,2023 12:01 #BR Ambedkar, #cm jagan, #Tweet

ప్రజాశక్తి-తాడేపల్లి: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ట్విట్టర్‌లో ‘భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ గారి వర్ధంతి నేడు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోంది. బాబా సాహెబ్‌ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

➡️