యాత్రికులను మోసం చేసిన టిటిడి ఒప్పంద కార్మికులు

May 23,2024 13:19 #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి-తిరుమల : యాత్రికులను టిటిడి ఒప్పంద కార్మికులు మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై టిటిడి విజిలెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన యాత్రికులకు స్వామివారి దర్శన టికెట్లు తీస్తామని లక్ష్మి శ్రీనివాస మన్‌ పవర్‌ కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది రూ.20 వేలు తీసుకున్నారు. వారు దర్శన టికెట్లు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన యాత్రికులు టిటిడి విజిలెన్స్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సిబ్బంది పరారీలో ఉన్నారని వారిని అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని టిటిడి విజిలెన్స్‌ అధికారులు తెలిపారు.

➡️