కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి జైలుశిక్ష..

Apr 11,2024 16:30 #speech, #tsrtc md sajjanar

గద్వాల : గద్వాల జిల్లాలో కండక్టర్‌ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు వ్యక్తులకు స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 చొప్పున జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. బీ కఅష్ణయ్య అనే కండక్టర్‌ గద్వాల ఆర్టీసీ డిపోలో విధులు నిర్వర్తిస్తున్నారు. 15 మార్చి 2015న అలంపూర్‌ నుంచి కర్నూల్‌కు వెళ్తున్న బస్సులో డ్యూటీలో ఉన్నారు. అలంపూర్‌ వద్ద తాగిన మత్తులో చాకలి శ్రీనివాస్‌, గోపి బస్సు ఎక్కి డోర్‌ వద్దే నిల్చని అసభ్యంగా ప్రవర్తించారు. బస్సెక్కే ప్రయాణికులను అసభ్యంగా తాకడం, ఉమ్మివేయడం వంటి వికఅత పనులు చేస్తుండడంతో గమనించిన కండక్టర్‌ ఇద్దరిని మందలించారు.
దాంతో కోపోద్రిక్తులైన ఇద్దరు కండక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. తిరుగు ప్రయాణంలోనూ మళ్లీ అదే బస్సెక్కి కండక్టర్‌ విధులకు ఆటంకం కలిగించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో గద్వాల కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరిని దోలుషుగా తేల్చింది. ఇద్దరికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ స్పందించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే సహించమని స్పష్టం చేశారు. దౌర్జన్యాలకు దిగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్‌, ఆర్టీసీ అధికారులకు యాజమాన్యం తరఫున అభినందనలు తెలిపారు.

➡️