అమలుకాని క్యాట్‌ ఉత్తర్వులు!

  • ఎబి వెంకటేశ్వరరావు పోస్టింగుపై చర్చ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలిచ్చి పది రోజులైనా ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. 1989 బ్యాచ్‌కు చెందిన డిజి క్యాడర్‌ ఐపిఎస్‌ అధికారి ఎబి వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో శాఖాపరమైన కారణాలను చూపుతూ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల క్యాట్‌ తక్షణమే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటం పట్ల ఐపిఎస్‌లతోపాటు పోలీస్‌శాఖలో చర్చ నడుస్తోంది. ఎబి వెంకటేశ్వరరావుకు సర్వీస్‌ కేవలం 13 రోజులు మాత్రమే ఉండటంతో పోస్టింగ్‌లో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేస్తారా లేక విధుల్లో చేరకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుందా అనే ప్రశ్న నెలకొంది. ఆయనకు మద్దతుగా జస్టిస్‌ ఫర్‌ ఎబివి పేరిట ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి పలువురు ఉత్తరాలు రాసే పనిలో నిమగమయ్యారు. తనకు పోస్టింగ్‌ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

➡️