ఉపాధ్యాయులపై నిర్బంధం

utf leaders arrest in ap
  • ధర్నాకు విజయవాడ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : విజయవాడలో తలపెట్టిన 36 గంటల ధర్నాకు వెళ్లకుండా యుటిఎఫ్‌ నాయకులను, ఉపాధ్యాయులను అనకాపల్లి జిల్లాలో ఎక్కడికక్కడ ప్రభుత్వం నిర్బంధించింది. ప్రతి నెలా ఒకటిన వేతనాలు చెల్లించాలని, ఆర్థిక బకాయిలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళ, బుధ వారాల్లో విజయవాడలో ధర్నాకు యుటిఎఫ్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి ఉపాధ్యాయులు తరలివెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు టీచర్ల ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి ముందస్తు అరెస్టులు చేశారు. యుటిఎఫ్‌ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బారును చోడవరం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్భంధించారు. బుచ్చెయ్యపేట మండలం సంఘం అధ్యక్షులు కామరాజుకు 151 నోటీసు అందజేశారు. గొలుగొండలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గాయత్రిని, కోటవురట్లలో మండల అధ్యక్షులు నరసింగరావును, పరవాడలో మండల అధ్యక్షులు బాలరాజును, సంఘం మండల అధ్యక్షులు భాస్కరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 2023 సెప్టెంబర్‌లో బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చీ అమలుచేయకపోడం, పదో తేదీ దాటినా ఒక్కో నెల జీతాలు ప్రభుత్వం చెల్లించడం, పిఆర్‌సి బకాయి, డిఎ, పిఎఫ్‌, రిటైర్మెంట్‌ సదుపాయాలు ఇవ్వకపోవడంతో ఈ ధర్నాకు యుటిఎఫ్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

➡️