ఈసీకి, సీఎస్ కు వర్ల రామయ్య లేఖ

varla ramaiah comments on cm photo on caste certificate

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వం పెన్షన్ దారులను సచివాలయం కు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్రని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ఈ మేరకు ఈసీకి, సీఎస్ కు బుధవారం లేఖ రాశారు. పేదల పై కక్ష..అధికారులు దీనికి వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. ఇప్పటికీ నగదు సచివాలయంలోకి అందలేదని.. వైసీపీ కార్యకర్తలు మంచం పై వృద్ధులను మోసుకు వస్తూ ఈసీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఉంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే నగదు విడుదల చేసి ఇళ్ళ వద్ద పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు జరిగే కష్ట నష్టాలకు ప్రభుత్వానిదే భాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

➡️