ప్రభుత్వ విధాన నిర్ణయాల వెనుక ఆయాచిత లబ్ధి

Feb 13,2024 08:11 #AP High Court, #mp raghurama
  • రఘురామ పిల్‌ విచారణార్హతపై 15న హైకోర్టు విచారణ

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల వెనుక సిఎం వైఎస్‌ జగన్‌, ఆయన ఆప్తులకు ఆయాచిత లబ్ధి చేకూరుతోందని, ఈ వ్యవహారాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత (పిల్‌) వాజ్య విచారణార్హతపై ఈ నెల 15న విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. నర్సాపురం వైసిపి ఎంపి కనుమూరి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌ సోమవారం విచారణకు వచ్చింది. వైఎస్‌ జగన్‌ తరఫు న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ కల్పించుకుని, పిటిషనర్‌ దాఖలు చేసిన రిప్లై కౌంటర్‌ ఆదివారం రాత్రి అందిందని, వాదనలకు గడువు కావాలని కోరారు. దీంతో విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

➡️