మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకుంటా – విజయసాయిరెడ్డి

Apr 13,2024 18:26 #speech, #vijayasaireddy

కందుకూరు : నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు,కొండేపి నియోజకవర్గాలలోని మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో నెల్లూరు ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, ఎంపి శ్రీ మోపిదేవి వెంకట రమణ, వైఎస్‌ఆర్‌సిపి ఎస్సి విభాగ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్‌రావులు మామిడి రైతులతో ముఖాముఖిలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉలవపాడు పరిసర ప్రాంతాలలో ఎంత మామిడి పంట విస్తరణ ఉంది..సీజన్‌ లో ఎంత మొత్తంలో ఉత్పత్తి జరుగుతుంది… ఏ ఏ ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. రైతులు ఎదుర్కొటున్న సమస్యలను విజయసాయిరెడ్డి అడిగి తెలుసుకున్నారు… ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మామిడి రైతులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. మామిడి రైతులు సంఘటితం చేసి ఒక సోసైటిగా ఏర్పాడి,వారి ఆధ్వర్యంలో నడిచే విధంగా మామిడి ఆహార శుద్దీ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. మామిడి పరిశోధన కేంద్రం యూనిట్‌ను ఉలవపాడు ప్రాంతంలో ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానన్నారు.

➡️