100 కార్లతో విశాఖ ఉక్కు పోరు…

Jan 8,2024 12:50 #Protest, #Visakha, #visakha steel
visakha steel plant protest in vizag
  • ఉక్కు మైన్స్ లీజును పునరుద్ధరణ చేయాలి 
  • ర్యాలీగా బయలుదేరి వచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు 

ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ ఉక్కు ఆంధ్రుల ప్రాణ హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం  విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి పరిరక్షణ కమిటీ సభ్యులు సుమారు 100 కార్లు పైన బయలుదేరి విజయనగరం మైన్స్ అధికారులను, జిల్లా కలెక్టర్ ను కలిసి మైన్స్ లీజును పునరుద్దించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ గేటు వద్ద విశాఖ ఉక్కు ఆంధ్రుల పరిరక్షణ హక్కు, విశాఖ మైన్స్ లీజు పొడిగించాలి, కార్మికుల సంక్షేమాన్ని మరిచిన ఉక్కు యాజమాన్యం అని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ స్కూల్ 1982వ సంవత్సరంలో 50 సంవత్సరాలకు విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గర్భం మాంగనీస్ ఓర్, సారిపల్లి దగ్గర ఉన్న ఇసుకను లీజును ఆనాడే కేటాయించడం జరిగిందన్నారు. అయితే ఇంకా పది సంవత్సరాలు ఉన్న ఈ లీజును గత సంవత్సర కాలం నుండి పొడిగించడానికి ప్రభుత్వం తత్కారము చేస్తుందన్నారు. దీనివలన బయట నుంచి కొనుక్కుంటే టన్ను 12000 చొప్పున తీసుకోవాల్సి వస్తుందని, అదే విశాఖ జిల్లా నుంచి తీసుకుంటే 3000కే రావడం జరుగుతుందని తెలిపారు. దీనివలన ఇటు కంపెనీకి ప్రభుత్వానికి మేలు జరుగుతుందని, లేకపోతే నష్టాలను చూపి కార్మికుల పైన కంపెనీ పైన నష్టం వస్తుందని చూపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 2021లో జనవరిలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి అనేక కుట్ర, కుతంత్రాలు పన్నుతూ వస్తుందన్నారు. దీనిని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ముందుకు వేయకుండా పరిరక్షించుకుంటూ రావడం జరుగుతుందన్నారు. కేంద్రానికి వీలు కాకపోవడంతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ గనులను లీజును పునరుద్ధరించకపోవడంతో విశాఖ ఉక్కును ఎలాగైనా ప్రైవేటుపరం చేయాలని చూస్తుందన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు చేతుల్లోకి వెళ్లకుండా పరి రక్షించుకోవడం జరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమేనని అన్నారు అదేవిధంగా విశాఖ ఉక్కును ఆంధ్రులు ఆనాడు 32 మంది ప్రాణాలు బలిచేసి సాధించుకోవడం జరిగింది దానితో ఆంధ్రుల యొక్క హక్కుగా దీన్ని రక్షించుకోవడం జరుగుతుందన్నారు. ఆంధ్రుల చేతుల్లో లేకుండా ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి తీసుకువెళ్లాలని ఈ కేంద్రము రాష్ట్రము చూస్తుందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పాట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని అన్నారు. స్థానిక విజయనగరం నాయకులు గుప్పెట్లో ఈ మైన్స్ ను ఇస్తారాజ్యంగా వాడుకొని అమ్ముకోవడం జరుగుతుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ యూనియన్ నాయకులు జే అయోధ్య రామయ్య, జనరల్ సెక్రెటరీ యు. రామేశ్వరరావు, చైర్మన్ డి. ఆదినారాయణ, రామచంద్రరావు కోటేశ్వరరావు ది మోహన్ కే సత్యనారాయణ సుమారు 300 మంది కార్మికులు విశాఖ నుంచి రావడం జరిగిందన్నారు. అదేవిధంగా స్థానిక సిఐటియు నాయకులు సురేష్, రెడ్డి శంకర్రావు, రవి తదితరులు పాల్గొన్నారు.

visakha steel plant protest in vizag a

➡️