YCP – బత్తలపల్లిలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

బత్తలపల్లి (సత్యసాయి జిల్లా) : వైసిపి అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఐదో రోజు సోమవారం శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి ప్రారంభమైంది. బత్తపల్లి, రామాపురం, మలకవేముల మీదగా పట్నంకు యాత్ర చేరుకోనుంది. సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్‌, టిడిపి నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ అన్షార్‌ అహ్మద్‌ లు చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు లో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొంటారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్న పేట, ఎస్‌ ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు సిఎం చేరుకుంటారు.

➡️